![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -289 లో.. పద్మావతి నిద్ర లేచి ఏడుస్తుంటుంది. ఇక అప్పుడే విక్కీ నిద్రలేచి.. ఏమైందని అడుగుతాడు. నా జీవితాన్ని మీరు నాశనం చేశారని పద్మావతి అనగానే.. విక్కీకి అసలేం అర్థం అవ్వదు. అందుకే క్లారిటీగా అసలు ఏమైందో చెప్పమని అడుగుతాడు. మన పెళ్లి రోజు జరగాల్సిన ఫస్ట్ నైట్.. వీళ్ళ పెళ్ళి రాత్రి జరిగిందని అనగానే అంత అబద్దమని విక్కీ అంటాడు. అవునా అయితే మరి ఒక మూడు నెలలు ఆగండి, నా కడుపులో మీ బిడ్డ ఉందని చూపిస్తానని పద్మావతి ఏడుస్తూ అంటుంది. ఇక విక్కీ ఆలోచనలో పడతాడు.
మరొకవైపు కనకం అరుణ్ కి ఫుడ్ తీసుకొని వెళ్తుంది. అసలు తప్పు చెయ్యనట్లు అరుణ్ మాట తీరు ఉంటుంది. దాంతో కనకానికి మరింత కోపం వస్తుంది. అప్పుడే స్వప్న వచ్చి.. నా జీవితాన్ని ప్రాబ్లమ్స్ లోకి నెట్టావ్.. నువ్వు బ్రతకవద్దని స్వప్న అంటుంది. అందరికి నిజం ఋజువు అయ్యే వరకు వీడు ఉండాలని కనకం అంటుంది. మరొకవైపు సుబ్రహ్మణ్యం కోసం సేట్ రిసార్ట్ కి వస్తాడు. అ సేట్ కనకాన్ని పిలిచి.. ఇక్కడ సుబ్రహ్మణ్యం ఎక్కడ ఉన్నారు.. అదే పెళ్లి కూతురు అనామిక తండ్రి ఎక్కడ? నేను అతని ఫ్రెండ్ ని అని అనగానే.. కనకం డైరెక్ట్ గా వాళ్ళు ఉన్న రూమ్ దగ్గరకి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత సేట్, అనామిక తండ్రి మాట్లాడుకుంటారు. " మీ కూతురు పెళ్లి అయిన మరుక్షణం నాకు ఇవ్వాల్సిన రెండు కోట్లు ఇస్తానని అన్నావ్. అందుకే వచ్చాను పెళ్లి అయ్యేవరకు ఇక్కడే ఉంటాను" అని అనామిక నాన్న సుబ్రహ్మణ్యంతో సేట్ అంటాడు. ఇక సుబ్రహ్మణ్యం టెన్షన్ పడుతుంటాడు.
మరొకవైపు పెళ్లిలో భాగంగా అన్నదమ్ములు ఎవరైనా సరే చెల్లికి గాని అక్కకు గాని గాజులు పెట్టి ఆశీర్వాదించాలని ఇందిరాదేవి చెప్తుంది. అ తర్వాత అనామికకి రాహుల్ గాజులు పెట్టి ఆశీర్వదిస్తాడు. అలాగే విక్కీ వాళ్ళ బావ కూడా అనామికకి గాజులు పెట్టి ఆశీర్వదిస్తాడు. కాసేపటి తర్వాత సుభాష్, ప్రకాష్ ఇద్దరు కనకానికి గాజులు పెట్టి ఆశీర్వదిస్తారు. అలా అనామిక-కళ్యాణ్ ల పెళ్లిలో ఇరు కుటుంబాలు సరదాగా ఉంటాయి. తరువాయి భాగంలో అందరు తమ జోడిలతో కలిసి స్టేజ్ మీద డాన్స్ చేస్తుంటారు. కళ్యాణ్, అనామిక ఇద్దరు డాన్స్ చేస్తుంటే అప్పు.. వాళ్ళని ఆగమని చెప్పి స్టేజ్ మీదకి వెళ్లి కళ్యాణ్ ని హగ్ చేసుకుంటుంది. అది చూసి అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |